Gold jewellery: దుబాయి నుంచి ఒకరు ఎంత బంగారం తెచ్చుకోవచ్చు?

How much Gold jewellery you can bring from Dubai without drawing taxmens ire in India

  • కనీసం ఏడాది పాటు నివాసం ఉంటేనే ప్రయోజనం
  • పురుషులు అయితే ఒకరు 20 గ్రాములు
  • మహిళ అయితే 40 గ్రాములపై పన్ను లేదు
  • అంతకుమించితే సుంకాలు చెల్లించాల్సిందే

ఇది పండుగల సీజన్. దుబాయి నుంచి పండుగల కోసం భారత్ కు వచ్చే వారు బంగారం తీసుకొస్తుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దుబాయి నుంచి వస్తుంటే బంగారం కొని తీసుకురమ్మని చెబుతుంటారు. ఎందుకంటే మన దేశంతో పోలిస్తే దుబాయిలో బంగారం ధరలు కొంత తక్కువగా ఉంటుంటాయి. దుబాయి పన్నుల రహిత కేంద్రం. ఇక్కడ బంగారం కొనుగోళ్లపై ఎలాంటి పన్నులు కట్టక్కర్లేదు. మరి దుబాయి నుంచి ఇక్కడకు బంగారం తీసుకొస్తే, దానిపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. దీనిపై అవగాహన అవసరం.

దుబాయిలో ధరలు తక్కువ ఉన్నాయని చెప్పి, అక్కడి నుంచి తక్కువ పరిమాణంలో ఆభరణాలు తెచ్చుకుంటే ఫర్వాలేదు. కానీ పెద్ద మొత్తంలో తీసుకొస్తే పన్నుల చెల్లింపుతో పెద్ద ప్రయోజనం ఉండదు. సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. రూపాయి మారకం విలువ ప్రభావం, జీఎస్టీ తదితర వాటితో అనుకున్న ప్రయోజనం నెరవేరదు.  

ఇవీ పరిమితులు..
ఒక పురుషుడు ఏడాది నుంచి విదేశంలో నివసిస్తుంటే, తన వెంట 20 గ్రాముల (రూ.50వేలు మించకుండా) బంగారం ఆభరణాలు తెచ్చుకోవచ్చు. అదే మహిళ అయితే ఈ పరిమితి 40 గ్రాములు (గరిష్టంగా రూ.లక్ష విలువ మేరకే) ఉంది. పిల్లలు కూడా విదేశంలో ఏడాది పాటు ఉంటే వారు సైతం తమ వెంట ఈ మేరకు ఆభరణాలు ఎలాంటి పన్ను లేకుండా తెచ్చుకోవచ్చు. ఆభరణాలు కాకుండా మరే ఇతర రూపంలో తెచ్చుకున్నా కస్టమ్స్ సుంకాలను చెల్లించాల్సి వస్తుంది.

గోల్డ్ బార్లు అయితే పది గ్రాములకు రూ.300 దిగుమతి సుంకం, దీనిపై 3 శాతం విద్యా సెస్సు చెల్లించాల్సి వస్తుంది. కాయిన్లు ఇతర రూపంలో అయితే 10 గ్రాములపై రూ.750 సుంకం, దీనిపై 3 శాతం విద్యా సెస్సు చెల్లించాలి. ఇక దుబాయిలో నిర్ణీత కాలం నివసించకుండా, తమ వెంట బంగారం తెచ్చుకుంటే దాని విలువపై 36.05 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు.

  • Loading...

More Telugu News