Raviteja: 20 మిలియన్స్ ప్లస్ వ్యూస్ ను రాబట్టిన 'ధమాకా' సాంగ్!

Dhamaka movie update

  • రవితేజ హీరోగా రూపొందిన 'ధమాకా' 
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రీలీల
  • 'జింతాక్' సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

రవితేజ ఏడాదికి మూడు సినిమాలైనా థియేటర్లకు తీసుకు వెళ్లాలనే ఒక ప్లానింగ్ తో ముందుకు వెళుతుంటాడు. ఏదైనా కారణాల వలన ఒక్కో ఏడాది అలా కుదరకపోయినా, ఎక్కువసార్లు మాత్రం తాను అనుకున్నది సాధించడం ఆయన కెరియర్లో మనకి కనిపిస్తుంది. అలాంటి రవితేజ నుంచి ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలు వచ్చేశాయి. మూడో సినిమాగా రావడానికి 'ధమాకా' ముస్తాబవుతోంది.    

మాస్ ఆడియన్స్ మనసు తెలిసిన నక్కిన త్రినాథరావు ఈ సినిమాను రూపొందించాడు. అభిషేక్ అగర్వాల్ - విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, భీమ్స్ సంగీతాన్ని  అందించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి 'జింతాక్' సాంగ్ ను వదిలారు. మంచి మాస్ బీట్ తో ఉన్న ఈ పాటకి మాస్ ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ లభించింది. 20 మిలియన్ ప్లస్ వ్యూస్ ను ఈ సాంగ్ దక్కించుకోవడం విశేషం. 

ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను మంగ్లీతో కలిసి భీమ్స్ ఆలపించాడు. రవితేజ సరసన నాయికగా శ్రీ లీల నటించిన ఈ సినిమాలో రావు రమేశ్ .. సచిన్ ఖేడ్ కర్ .. జయరామ్ .. పవిత్ర లోకేశ్ .. తులసి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Raviteja
Sree leela
Dhamaka Movie

More Telugu News