Telangana: మునుగోడులో బీజేపీకి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

ts minister jagadish reddy bumter offer to bjp in munugode bypolls

  • మునుగోడు అభివృద్ధికి రూ.18 వేల కోట్ల నిధులు ఇవ్వాల‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి
  • ఆ నిధులిస్తే పోటీ నుంచి టీఆర్ఎస్ త‌ప్పుకుంటుంద‌ని వెల్ల‌డి
  • కేసీఆర్‌ను ప్రాధేయ‌ప‌డి అయినా ఒప్పిస్తామంటూ ప్ర‌క‌ట‌న‌

మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి బీజేపీకి టీఆర్ఎస్ కీల‌క నేత‌, మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సోమ‌వారం ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే... ఉప ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో త‌మ డిమాండ్ మేర‌కు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మునుగోడుకు రూ.18 వేల కోట్ల నిధులు మంజూరు చేస్తే... పోటీ నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిని త‌ప్పిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. 

ఈ విష‌యంలో సీఎం కేసీఆర్‌ను ప్రాధేయ‌ప‌డి అయినా తాము ఒప్పిస్తామ‌ని జ‌గ‌దీశ్ రెడ్డి చెప్పారు. త‌న సంస్థ‌కు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ద‌క్కిందంటూ బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, జ‌గ‌దీశ్ రెడ్డి ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించార‌న్న‌వాద‌న వినిపిస్తోంది.

More Telugu News