Nagaland: నా కళ్లు చిన్నవే కావచ్చు... మైలు దూరంలో ఉన్న కెమెరాను కూడా చూడగలను: నాగాలాండ్‌ మంత్రి సరదా ట్వీట్‌

My eyes may be small but i can see camara from a mile says Nagaland minister

  • జనం మధ్య కూర్చుని తదేకంగా చూస్తున్న ఫొటోను పోస్ట్ చేసిన ఇన్మా అలోంగ్
  • కెమెరా కోసం ఫోజు పెట్టి రెడీగా ఉంటానంటూ క్యాప్షన్
  • తరచూ సరదాగా పోస్టులు చేసే ఇన్మా అలోంగ్.. 
  • ఇన్మా అలోంగ్ నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు కూడా!

సరదా వ్యాఖ్యలు, పోస్టులతో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నాగాలాండ్ ఉన్నత విద్యా శాఖ మంత్రి తెంజెన్ ఇన్మా అలోంగ్ తాజాగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల వారి శరీరతత్వం వేరుగా ఉంటుంది. వారి కళ్లు కాస్త చిన్నవిగా ఉంటాయి. దీనిని ఆయన తన సరదా పోస్టులో పరోక్షంగా ప్రస్తావించారు. అప్పుడప్పుడూ తనను ఫొటో తీయడానికి ప్రయత్నిస్తున్న వారిని ఉద్దేశించి పోస్ట్ చేశారు.

జనం మధ్యలో ఉన్న ఫొటో పెట్టి..
ఇన్మా అలోంగ్ ఎక్కడో జనం మధ్యలో కూర్చుని చూస్తున్న తన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దానికి.. ‘‘నా కళ్లు చిన్నవిగానే ఉండవచ్చు.. కానీ మైలు దూరంలో ఉన్న కెమెరాను కూడా పట్టేస్తా. కెమెరా కోసం ఎప్పుడూ రెడీగా ఫోజు పెట్టి ఉంటా. అంతేకాదు ఇది చదువుతున్నప్పుడు మీరు నవ్వుతుండటం కూడా నేను చూడగలను. గుడ్ మార్నింగ్” అని తన ఫొటోకు క్యాప్షన్ పెట్టారు.

  • నాగాలాండ్ మంత్రి పెట్టిన ఈ పోస్ట్ ట్విట్టర్ లో వైరల్ గా మారింది. దీనికి 79 వేలకుపైగా లైకులు రాగా... వేలకొద్దీ రీట్వీట్లు వస్తున్నాయి. నెటిజన్లు మంత్రి హాస్య చతురతను ప్రశంసిస్తున్నారు. ‘మంచి హాస్య చతురత, బంగారం లాంటి మనసు ఉన్న నేత’ అని చాలా మంది పొగుడుతున్నారు.
  • ‘‘మీరు మమ్మల్ని ఎప్పటికీ నవ్విస్తూనే ఉంటారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే.. ‘మొత్తం దేశంలోనే మీలా రంజింపజేసే మంత్రి ఎవరూ లేరు. ఈ విషయంలో మీరు ఎంతో శక్తిమంతులు’ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
  • ఇంతకు ముందు, కొందరు అభిమానులు తనతో దిగిన గ్రూప్ ఫొటోను ఇన్మా అలోంగ్ షేర్ చేశారు. ‘‘మనం ఇంకా పెళ్లికాకుండా ఉండి, చాలా క్యూట్ గా ఉంటే.. ఇలాగే అంతా మన వెంట పడతారు” అని సరదా కామెంట్ పెట్టారు. అది కూడా అప్పట్లో వైరల్ గా మారింది.

More Telugu News