Mahesh Babu: మహేశ్ మూవీలో మెరవనున్న అనన్య పాండే!

Trivikram Movie Update

  • షూటింగు దశలో మహేశ్ 28వ సినిమా 
  • త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇది మూడో సినిమా 
  • కథానాయికగా సందడి చేయనున్న పూజ హెగ్డే 
  • ఐటమ్ సాంగులో అనన్య అందాల అల్లరి 

బాలీవుడ్ నుంచి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆ జాబితాలో అనన్య పాండే కూడా కనిపిస్తుంది. 'లైగర్' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దాంతో ఇక అనన్య పాండేకి ఇప్పట్లో అవకాశాలు రాకపోవచ్చని భావించారు. 

కానీ ఈ నాజూకు సుందరి మహేశ్ మూవీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మహేశ్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుంది. ఆల్రెడీ అటు త్రివిక్రమ్ తోను .. ఇటు మహేశ్ బాబుతోను ఆమెకి హిట్స్ ఉన్నాయి. అందువలన అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. 

కాగా, ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఆ సాంగును అనన్య పాండేతో చేయించాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు గాను ఆమెకి భారీ పారితోషికమే ముడుతుందని అంటున్నారు. డిఫరెంట్ లుక్ తో మహేశ్ బాబు కనిపించనున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. వచ్చే వేసవిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News