Allu Arjun: ఫిలింఫేర్ అవార్డుల్లో 'పుష్ప' క్లీన్ స్వీప్ చేసింది: అల్లు అర్జున్

Allu Arjun says Pushpa clean sweeps Filmfare awards
  • ఘనంగా 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం
  • బెంగళూరులో కార్యక్రమం
  • ఏడు విభాగాల్లో అవార్డులు కైవసం చేసుకున్న పుష్ప
  • కృతజ్ఞతలు తెలిపిన ఐకాన్ స్టార్
బెంగళూరులో నిన్న రాత్రి 67వ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండుగలా జరిగింది. ఈసారి ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప హవా కనిపించింది. పుష్ప చిత్రానికి ఏడు విభాగాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి. 

దీనిపై పుష్ప కథానాయకుడు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఫిలింఫేర్ అవార్డుల్లో పుష్ప క్లీన్ స్వీప్ చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఉత్తమ నేపథ్య గాయని విభాగాల్లో పుష్ప సత్తా చాటిందని బన్నీ తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
Allu Arjun
Pushpa
Filmfare
Awards
Tollywood

More Telugu News