Allu Sirish: 'ఊర్వశివో రాక్షసివో' నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్!

Urvasivo Rakshasivo Lyrical Song Released

  • అల్లు శిరీష్ తాజా చిత్రంగా రూపొందిన 'ఊర్వశివో రాక్షసివో'
  • నాయిక పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్ 
  • సంగీత దర్శకుడిగా అచ్చు రాజమణి 
  • దర్శకుడిగా రాకేశ్ శశి

అల్లు శిరీష్ సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటూ వెళుతున్నాడు. ఎంత ఆలస్యమైనా తనకి కథ బాగా నచ్చితేనే వస్తానని చెబుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'ఊర్వశివో .. రాక్షసివో' సినిమా. ఇది ఒక విభిన్నమైన కథ .. విలక్షణమైన పాయింట్ తో రూపొందింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్ - విరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు.   
అల్లు శిరీష్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగును వదిలారు. 'అనగా అనగనగా .. కనులే కలగనగా .. నిజమయ్యి మెరుపల్లే వాలేగా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్ ఒకరిని ఒకరు కలుసుకుంటూ .. తలచుకుంటూ పాడుకునే పాట ఇది. 

పూర్ణాచారి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. యూత్ కి నచ్చే బీట్ లోనే ఈ పాట నడిచింది. చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడిన అనూ ఇమ్మాన్యుయేల్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.

Allu Sirish
Anu Emmanuel
Rakesh Shashi

More Telugu News