Archana Nag: మాయలేడి అర్చన వద్ద మంత్రి, ఎమ్మెల్యేల నగ్న వీడియోలు.. విచారణలో విస్తుపోయే నిజాలు!

Bhubaneswar lady blackmailer Archanas diary seized

  • అర్చన వలలో ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు
  • ఆమె ఉచ్చులో మొత్తం 64 మంది  ప్రముఖులు
  • మంత్రి నుంచి రూ. 5 కోట్లు, ఎమ్మెల్యేల నుంచి రూ. కోటి డిమాండ్
  • మూడు కంపెనీలకు యజమాని కూడా
  • భర్త సహకారంతో చెలరేగిపోయిన అర్చన

తన అందచందాలతో ప్రముఖులను ఉచ్చులోకి లాగి ఆపై ఏకాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు, ఫొటోలు చూపించి బెదిరిస్తున్న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన మాయలేడి అర్చన నాగ్‌ను విచారిస్తున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుని ఆపై ఇంటికి రప్పించేది. ఆ తర్వాత వారితో ఏకాంతంగా గడుపుతూ ఆ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించేది. ఆపై వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించేది. అడిగినంత ఇవ్వకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని బెదిరించేది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఆమెను విచారిస్తున్న పోలీసులు నిందితురాలు బయటపెడుతున్న విషయాలు విని నిర్ఘాంతపోయారు. 

2015లో కలహండి జిల్లాలోని కెసింగ అనే ప్రాంతం నుంచి భువనేశ్వర్ వచ్చి స్థిరపడిన అర్చన కోట్లకు పడగలెత్తింది. దీంతో అనుమానించిన పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆమె సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమెకు 64 మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తేలింది. భువనేశ్వర్‌లోని బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న సమయంలో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పోలీసు అధికారుల ఫోన్ నంబర్లు సంపాదించి వారితో నెమ్మదిగా పరిచయాలు పెంచుకుంది. అనంతరం వారిని ఇంటికి పిలిపించుకుని ఏకాంతంగా గడిపేది. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించి ఆపై వాటిని చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేసేదని పోలీసులు తెలిపారు. అంతేకాదు బెంగాల్, ముంబై నుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం చేయించి దానిని ప్రధాన వ్యాపారంగా మార్చుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

మరోవైపు, ఆమె వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న నేతల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఆమె వద్ద ఉన్న వీడియోల్లో తమవి కూడా ఉన్నాయని తెలిసి బిజూ జనతాదళ్, బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. అంతేకాదు, ఈ జాబితాలో పోలీసు అధికారులు కూడా ఉన్న విషయం బయటకు రావడంతో వారు సెలవులపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖులను బుట్టలో వేసుకుని డబ్బులు గుంజే ఆమెకు పాత కార్ల షోరూం, ఆదిత్య ప్రెస్టీజ్ లిమిటెడ్‌తోపాటు మరో కంపెనీ కూడా ఉంది. భువనేశ్వర్‌లోని సత్య విహార్ ప్రాంతంలో కోట్ల రూపాయల విలువ చేసే భవనాన్ని నిర్మించింది. గతేడాది జనవరిలో దీనిని ఎమ్మెల్యే సూర్యనారాయణ పాత్రా ప్రారంభించారు.

మరోవైపు, ఆమె వలలో 64 మంది ప్రముఖులు చిక్కుకున్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పేర్లు వెల్లడించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రుతి పట్నాయక్ డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆమెకు ఖరీదైన భవనాలు, ఫామ్ హౌస్‌లు, ఖరీదైన గుర్రాలు, విదేశీ జాగిలాలు, అధునాతన కార్లు, ద్విచక్ర వాహనాలు ఎలా వచ్చాయో తేల్చాలని డిమాండ్ చేశారు. అర్చన నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లలో ఓ మంత్రి, పశ్చిమ ఒడిశాకు చెందిన పేరున్న ఓ బీజేపీ నేత, ఎమ్మెల్యేలు, బిల్డర్లు, సినీ నిర్మాతలు, పోలీసు అధికారుల పేర్లు, వారి నగ్న చిత్రాలు చూసి విచారణ అధికారులు విస్తుపోయారు. 

మంత్రితో ఏకాంతంగా ఉన్న ఫొటోలను చూపించి రూ. 5 కోట్లు, ఎమ్మెల్యేల నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్చన భర్త జోగ బందునాగ్ సహకారం ఉందని, గదిలో రహస్య కెమెరాలు పెట్టడం, ఆ దృశ్యాలను చిత్రీకరించడం వంటివి ఆయనే చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News