MK Stalin: డీఎంకే అధినేతగా స్టాలిన్ మరోసారి ఏకగ్రీవం
- ఇటీవల ఏర్పాటైన డీఎంకే జనరల్ కౌన్సిల్
- నేడు చెన్నైలో సమావేశం
- స్టాలిన్ నాయకత్వానికే మొగ్గుచూపిన డీఎంకే నేతలు
- ప్రధాన కార్యదర్శిగా దురైమురుగన్
- కోశాధికారిగా టీఆర్ బాలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఏర్పాటైన డీఎంకే జనరల్ కౌన్సిల్ ఇవాళ చెన్నైలో సమావేశమైంది. ఈ సమావేశంలో, డీఎంకే నేతలు స్టాలిన్ నాయకత్వానికే ఓటేశారు. డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పార్టీ సీనియర్ నేత దురైమురుగన్, కోశాధికారిగా టీఆర్ బాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం స్టాలిన్ తో పాటు దురైమురుగన్, టీఆర్ బాలు ఈ పదవులు చేపట్టడం ఇది రెండోసారి.
తండ్రి కరుణానిధి మరణానంతరం స్టాలిన్ 2018లో తొలిసారి డీఎంకే చీఫ్ గా ఏకగ్రీవం అయ్యారు. 69 ఏళ్ల స్టాలిన్ గతంలో డీఎంకే పార్టీలో కోశాధికారిగానూ, పార్టీ యువజన విభాగం కార్యదర్శిగానూ వ్యవహరించారు.