Rhino: పరుగెత్తుకొచ్చి లారీని ఢీకొట్టిన రైనో.. వైరల్​ వీడియో ఇదిగో

Rhino hits truck in assam

  • అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో ఘటన
  • వీడియోను షేర్ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
  • ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సి ఉందని వెల్లడి
  • లారీ డ్రైవర్ కు ఫైన్ వేయడంపై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు

అదో అటవీ ప్రాంతం.. మధ్యలో నున్నటి డబుల్ రోడ్డు.. ఓ లారీ, దాని వెనుక కొంత దూరంలో ఓ కారు వస్తున్నాయి.. రోడ్డు పక్కనే ఓ భారీ రైనో నిలబడి ఉంది.. వేగంగా వస్తున్న లారీని చూసి దాన్నిఢీకొట్టడానికి ముందుకు పరుగెత్తింది. లారీ డ్రైవర్ అది గమనించి కాస్త పక్కకు తప్పించాడు. అయినా రైనో వేగంగా పరుగెత్తుకు వచ్చి.. లారీ పక్క భాగంలో బలంగా ఢీకొట్టింది. అస్సాంలోని ప్రఖ్యాత కజిరంగ నేషనల్ పార్క్ లో ఈ ఘటన జరిగింది.

వీడియో షేర్ చేసిన అస్సాం సీఎం
అయితే లారీ వేగంగా ఉండటం, పక్కభాగంలో ఉక్కు ప్లేట్లు ఉన్నచోట ఢీకొట్టడంతో రైనోకు బలంగానే దెబ్బతగిలి కింద పడిపోయింది. లారీ వెళ్లిపోయాక లేచి నిలబడిన రైనో.. మళ్లీ పడిపోయింది. ఆ వెంటనే లేచి అడవి లోపలికి పరుగెత్తింది. ఈ ఘటనలో రైనోకు బలంగానే గాయమై ఉంటుందని భావిస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

వాటి ప్రాంతంలోకి వెళ్లి ఇబ్బంది పెట్టొద్దంటూ..
‘‘రైనోలు మనకు ప్రత్యేక స్నేహితులు. వాటి స్థలంలోకి వెళ్లి మనం వాటిని ఇబ్బంది పెట్టొద్దు. హల్దిబరి ప్రాంతంలో జరిగిన ఓ దురదృష్టకర ఘటన ఇది. రైనో ప్రమాదానికి గురైంది. ఆ లారీని గుర్తించి జరిమానా వేశాం. కజిరంగ నేషనల్ పార్కులో ఇలాంటి ఘటనలు జరగకుండా 32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్ తరహాలో) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం” అని హిమంత బిశ్వశర్మ క్యాప్షన్ పెట్టారు.

  • ఈ వీడియోకు లక్షన్నరకుపైగా వ్యూస్, వేలకొద్దీ రీట్వీట్లు వస్తున్నాయి. రైనో గాయపడటంపై అంతా బాధ వ్యక్తీకరిస్తున్నా.. లారీ డ్రైవర్ ది తప్పు అనడం, ఫైన్ వేయడంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
  • ‘‘లారీ డ్రైవర్ రైనోను కాపాడటానికి బాగానే ప్రయత్నించాడు. అతడి తప్పేం లేదు. నిజానికి చెప్పాలంటే.. అక్కడ రోడ్డు వేసిన ప్రభుత్వానిదే ఈ తప్పు’ అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు.
  • ‘అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. వాహనాలను చాలా మెల్లగా నడపాల్సి ఉంటుంది. లారీ డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. రైనో కనబడితే దూరంగానే వాహనాన్ని ఆపేయాలి. అతడు తప్పు చేశాడు’ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
  • ‘అలాంటి ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి’, ‘రైనోలు కనిపిస్తే ఆగాలని వాహనదారులను హెచ్చరించాలి. ఇందుకోసం బోర్డులు పెట్టాలి’, ‘లారీ డ్రైవర్ తప్పేం లేదు..’ ఇలా ఎన్నో కామెంట్లు వస్తున్నాయి.

Rhino
Assam
Rhino hits Truck
Truck
Viral Videos
Offbeat
Himantha biswa sharma

More Telugu News