India: ఖలిస్థాన్ రెఫరెండాన్ని ఆపండి.. కెనడా ప్రభుత్వానికి భారత్ డీమార్చ్

India demarches Canada over Nov 6 Khalistan referendum

  • అధికారికంగా దౌత్య మార్గంలో కోరిన భారత్
  • కెనడా స్పందనపై ఆసక్తి
  • భారత సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని లోగడ ప్రకటన

కెనడాలోని ఆంటారియాలో వచ్చే నెల 6న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ ఖలిస్థాన్ పై రెఫరెండం నిర్వహించకుండా అడ్డుకోవాలని, జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత దేశ సమగ్రత, సౌర్వభౌమత్వాన్ని ఈ రెఫరెండం సవాలు చేస్తోందని పేర్కొంది. కెనడా హై కమిషన్ సీనియర్ అధికారికి ఈ మేరకు డీమార్చ్ (అధికారిక వినతి/డిమాండ్)ను భారత విదేశాంగ శాఖ అధికారి అందజేశారు.

భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని కెనడా ప్రభుత్వం సెప్టెంబర్ 16న ప్రకటించడం గమనార్హం. ఖలిస్థాన్ రెఫరెండాన్ని తాము గౌరవించబోమని తేల్చి చెప్పింది. తొలిసారి రెఫరెండాన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ గత నెల 18న ఆంటారియాలోని బ్రాంప్టన్ లో నిర్వహించగా, రెండో విడత నవంబర్ 6న ఆంటారియా సబర్బన్ లోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనుంది. 

రెఫరెండాన్ని అడ్డుకోవాలని భారత్ అధికారికంగా కోరినప్పటికీ, ఈ విషయంలో కెనడా సర్కారు చర్యలు తీసుకోవడం సందేహమే. ఎందుకంటే తమ దేశంలో వ్యక్తులు ఎవరైనా శాంతియుతంగా, చట్టం పరిధిలో తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చన్న విధానానికి ట్రూడో సర్కారు కట్టుబడి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే రెఫరెండాన్ని తాము గుర్తించబోమని, భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని అంటోంది. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమాన్ని కెనడా వేదికగా నిర్వహిస్తుండడం గమనార్హం.

India
Canada
demarches
Khalistan referendum
  • Loading...

More Telugu News