Usha Rani: టీఎస్ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నాయకురాలు ఉషారాణి

Maoist woman leader Usha Rani surrenders before TS Police

  • ఉషారాణి స్వస్థలం ఏపీలోని తెనాలి
  • మద్రాసులో ఎంఏ చదివిన ఉషారాణి
  • 40 ఏళ్ల కాలంలో వివిధ హోదాల్లో పని చేసిన మావోయిస్టు నాయకురాలు

సీనియర్ మావోయిస్టు నాయకురాలు ఉషారాణి అలియాస్ పోచక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె స్వస్థలం ఏపీలోని తెనాలి. మద్రాస్ యూనివర్శిటీలో ఎంఏ చదివారు. 1980లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె... 40 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేశారు. ఆమెను మీడియా ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఉషారాణి దండకారణ్యం డివిజనల్ కమిటీ సెక్రటరీగా పని చేస్తున్నారని తెలిపారు. 40 ఏళ్ల పాటు ఆమె వివిధ హోదాల్లో పని చేశారని చెప్పారు. అనారోగ్య కారణాలతో ఆమె లొంగిపోయారని వెల్లడించారు. పలువురు సీనియర్ మావోయిస్టు నేతలు అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

Usha Rani
Maoist
TS Police
  • Loading...

More Telugu News