Anushka Shetty: అనుష్క చేస్తున్న సినిమా కూడా అదే పాయింట్ చుట్టూ తిరుగుతుందట!

Anushka movie update

  • షూటింగు దశలో అనుష్క సినిమా 
  • నిర్మాణ సంస్థగా యూవీ 
  • ముఖ్యమైన పాత్రలో నవీన్ పోలిశెట్టి 
  • సరోగసి చుట్టూ తిరిగే కథ అంటూ టాక్    

అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. అయినా ఆమె పట్ల జనంలో ఎంతమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆమె నుంచి ఎప్పుడు సినిమా వస్తుందా అనే వాళ్లంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆమె తాజా చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. 

ఈ సినిమాలో అనుష్క ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉండగా, ముఖ్యమైన పాత్రలో నవీన్ పోలిశెట్టి నటిస్తున్నాడు. కొంతకాలంగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా టీమ్ తెగ టెన్షన్ పడుతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. వారి కంగారుకు కారణం 'స్వాతిముత్యం' సినిమా అంటున్నారు. 

'స్వాతిముత్యం' కథ అంతా కూడా వీర్యదానం - సరోగసి అనే పాయింట్ చుట్టూ కామెడీని టచ్ చేస్తూ నడుస్తుంది. కామెడీని పక్కన పెడితే, అనుష్క సినిమా కథాంశం కూడా ఇదేనని అంటున్నారు. దాంతో 'స్వాతిముత్యం' కథకి దగ్గరగా ఉందే అనే మాట రాకుండా ఈ సినిమా టీమ్ జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anushka Shetty
Naveen Polishetty
Swathimuthyam Movie
  • Loading...

More Telugu News