Tirumala: తిరుమలలో ఆరు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ... క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశం నిలిపివేసిన టీటీడీ

Huge rush in Tirumala as Darshan takes two days

  • తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
  • శ్రీవారి దర్శనానికి 48 గంటలు
  • గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 6 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నారాయణగిరి నుంచి గోగర్భం రిజర్వాయర్ వరకు క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. క్యూలైన్లు నిదానంగా కదులుతుండగా, స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అంచనా. 

ఈ నేపథ్యంలో, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (శనివారం) ఉదయం వరకు క్యూలైన్లలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది. ఈ సాయంత్రం క్యూలైన్ల వద్దకు వచ్చిన భక్తులను అధికారులు తిప్పి పంపారు. వారు రేపు ఉదయం 6 గంటలకు రావాలని సూచించారు. 

దీనిపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. గోగర్భం వద్ద క్యూలైన్లను పరిశీలించిన ఆయన, తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారని, అందుకే రద్దీ పెరిగిందని అన్నారు. రద్దీ వల్ల భక్తులకు అసౌకర్యం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు.

More Telugu News