Belllamkonda Ganesh: హీరోగా నన్ను అంగీకరించారు .. అంతకుమించిన ఆనందం లేదు: బెల్లంకొండ గణేశ్

Swathimuthyam Movie Success Meet

  • ఈ నెల 5న రిలీజైన 'స్వాతిముత్యం'
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ పరిచయం 
  • ఎక్కువ మార్కులు కొట్టేసిన కామెడీ
  • తొలి సక్సెస్ పట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన హీరో

బెల్లంకొండ గణేశ్ - వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'స్వాతిముత్యం' సినిమా ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. సితార నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలిసి నడిపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సహజత్వానికి దగ్గరగా పాత్రలను మలిచిన తీరు వలన కథ వెంటనే కనెక్ట్ అయింది. తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం సక్సెస్ మీట్ ను జరుపుకుంది.

 ఈ వేదికపై బెల్లంకొండ గణేశ్ మాట్లాడుతూ .. "ముందుగా నేను తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే హీరోగా నన్ను అంగీకరించారు .. ఈ సినిమాకి సక్సెస్ ఇచ్చారు. ఈ సినిమాలో తెరపై గణేశ్ కనిపించలేదు .. బాలా అనే అఆయన పాత్రమే కనిపించిందని అంటున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హీరోగా తొలి సినిమాతో ఒక 10 మార్కులు వేయించుకున్నానని అనుకుంటున్నాను"అన్నాడు.

 "ఇంతమంచి కథను నా దగ్గరికి తీసుకుని వచ్చినందుకు లక్ష్మణ్ కృష్ణకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ కథను మా కంటే ఎక్కువగా నమ్మి, నిర్మాతగా ముందుకు వచ్చిన సితార వంశీ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ బెల్లంకొండ గణేశ్ చెప్పుకొచ్చాడు. ఇక వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ ... " ఈ సినిమాలో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. సీనియర్ ఆర్టిస్టులతో కలిసి నటించే ఒక అవకాశం నాకు ఈ సినిమా వలన కలిగింది" అంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది.

Belllamkonda Ganesh
Varsha Bollamma
Divya Sripada
  • Loading...

More Telugu News