BRS: ఏపీలో బీఆర్ఎస్ సందడి.. అమలాపురంలో వెలిసిన బీఆర్ఎస్ పోస్టర్లు

BRS posters in Amalapuram

  • బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్
  • బీఆర్ఎస్ కు మద్దతుగా ఏపీలో వెలుస్తున్న పోస్టర్లు
  • జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి దశలో కేసీఆర్ ప్రధానంగా పొరుగు రాష్ట్రాలపై ఎక్కువ దృష్టిని సారించబోతున్నారు. ముఖ్యంగా ఏపీలో తన కార్యాచరణను వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు, ఏపీలో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ కు మద్దతుగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. 

తాజాగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. అమలాపురం క్లాక్ టవర్ వద్ద ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. జై బీఆర్ఎస్... జై కేసీఆర్ అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. 'బీఆర్ఎస్ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి... రేవు అమ్మాజీ రావు.. డబల్ ఎంఏ' అంటూ ఫ్లెక్సీపై ఉంది.

BRS
KCR
TRS
Amalapuram
Flexi
  • Loading...

More Telugu News