Manchu Vishnu: 'జిన్నా'లో పెంచలయ్యగా సునీల్ లుక్ ఇదే!

Ginna Movie Update

  • మంచు విష్ణు హీరోగా రూపొందిన 'జిన్నా'
  • యాక్షన్ కామెడీ జోనర్లో నడిచే కథ 
  • హీరోయిన్స్ గా పాయల్ -  సన్నీలియోన్ అందాల సందడి 
  • ఈ నెల 21వ తేదీన విడుదలవుతున్న సినిమా   

హీరో పాత్రల వైపు నుంచి కమెడియన్ గా వెనక్కి వచ్చేసిన సునీల్, విభిన్నమైన పాత్రలను పోషించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తున్నాడు. అడపా దడపా కామెడీ రోల్స్ కూడా చేస్తూనే ఉన్నాడు. అలా తాజాగా ఆయన 'జిన్నా' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో ఆయన 'పెంచలయ్య' పాత్రలో కనిపించనున్నాడు. 

అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సునీల్ కమెడియన్ గానే సందడి చేశాడనే విషయం ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. పెళ్లి కొడుకు లుక్ తో ఉన్న ఆయనలో భయం - బాధ రెండూ కనిపిస్తూనే ఉన్నాయి. అందుకు కారణం ఏమై వుంటుందా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడవలసిందే. 

మంచు విష్ణు తాను హీరోగా సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ఇది. యాక్షన్ .. కామెడీ ఎంటైనర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. జి. నాగేశ్వర రెడ్డి కథను అందించిన ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చాడు. మంచు విష్ణు సరసన పాయల్ - సన్నీలియోన్ అందాల సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన బాణీలు .. ఇప్పటికే మాస్ లోకి వెళ్లిపోయాయి. ఈ నెల 21వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. 

Manchu Vishnu
Payal
Sunny Leone
Ginna Movie
  • Loading...

More Telugu News