Balakrishna: 'దీపావళి'కి బాలయ్య సినిమా టైటిల్ ప్రకటన!

Gopichand Malineni Movie Update

  • షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా 
  • ఇప్పటికే చాలావరకూ జరిగిన షూటింగ్ 
  • కథానాయికగా సందడి చేయనున్న శ్రుతి హాసన్ 
  • సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్       

బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 107వ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో నిర్మితమవుతోంది. ఈ సినిమాకిగాను కొన్ని పవర్ఫుల్ టైటిల్స్ వినిపించాయిగానీ, ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు.

'దసరా' పండుగ రోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ ఉండొచ్చని బాలయ్య అభిమానులు భావించారు. కానీ బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టీజర్ ఈవెంట్ పై ఫోకస్ చేయడం వలన కుదరలేదు. దాంతో బాలయ్య 107వ సినిమాకి సంబంధించిన టైటిల్ ప్రకటన దీపావళికి ఉండొచ్చని అంటున్నారు. టైటిల్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా గోపీచంద్ మలినేని కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. 

ఈ సినిమాలో బాలయ్య జోడీగా శ్రుతి హాసన్ అలరించనుంది. ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. బాలయ్య సెంటిమెంట్ కి తగినట్టుగా సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే కూడా ఆయన బోయపాటిని లైన్లో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. . మొత్తానికి బాలయ్య స్పీడ్ మాత్రం తగ్గడం లేదు.

Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni Movie
  • Loading...

More Telugu News