Chiranjeevi: నయనతార డబ్బు మనిషి కాదు: 'గాడ్ ఫాదర్' నిర్మాత ఎన్వీ ప్రసాద్!

NV Prasad Interview

  • నిన్ననే విడుదలైన 'గాడ్ ఫాదర్' 
  • ప్రమోషన్స్ లో బిజీగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ 
  • చిరూ - మోహన్ రాజా వల్లనే నయన్ ఈ సినిమా చేశారంటూ వెల్లడి 
  • డబ్బు గురించి ఆమె అడగనే లేదంటూ వ్యాఖ్య 
  • పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన ఎన్వీ ప్రసాద్ 

తెలుగు .. తమిళ .. మలయాళ భాషలలో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. సీనియర్ స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూనే, నాయిక ప్రధానమైన కథలలోను తనకి తిరుగులేదనిపిస్తోంది. ఈ మూడు భాషల్లోని మేకర్స్ ఆమె ఓకే అంటే చాలు .. పారితోషికం ఎంతైనా ఫరవాలేదు అనే పరిస్థితుల్లోనే ఉన్నారు. కొన్నేళ్లుగా ఆమె అదే క్రేజ్ ను కొనసాగిస్తుండటం విశేషం. 

నయనతార ప్రమోషన్స్ కి రాదనే విషయం అందరికీ తెలిసిందే. పారితోషికం విషయంలోను ఆమె చాలా నిర్మొహమాటంగా వ్యవహరిస్తుందని అంటారు. ఫైనల్ పేమెంట్ క్లియర్ చేస్తేనే ఆమె షూటింగు పూర్తి చేస్తుందని చెబుతారు. కానీ అదంతా పుకారు మాత్రమే అనే విషయాన్ని స్పష్టం చేస్తూ 'గాడ్ ఫాదర్' నిర్మాత ఎన్వీ ప్రసాద్ నయనతారను అభినందించడం ఆశ్చర్యపరుస్తోంది. 

"నయనతార చాలా బిజీ .. అయినా చిరంజీవిగారి పట్ల ఆమెకి గల గౌరవభావం .. మోహన్ రాజా పట్ల గల అభిమానం కారణంగా 'గాడ్ ఫాదర్' చేయడానికి ఒప్పుకున్నారు. సినిమా అంగీకరించిన దగ్గర నుంచి ఎంతో క్రమశిక్షణతో ఆమె తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. ఏ రోజున కూడా ఆమెగానీ .. ఆమె టీమ్ గాని డబ్బు గురించిన ప్రస్తావన తీసుకుని రాలేదు. ఆమె అంకితభావాన్ని అభినందించకుండా ఉండటం కష్టం" అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి నయనతార విషయంలో పుకార్లకు ఆయన చెక్ పెట్టేసినట్టే చెప్పుకోవాలి.

Chiranjeevi
Nayanthara
NV Prasad
God Father Movie
  • Loading...

More Telugu News