white sharks: షార్క్ లు, షార్క్ లపై దాడిచేసి తినేస్తే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!
- గ్రేట్ వైట్ షార్క్ ను చుట్టుముట్టి వేటాడిన ఓర్కా రకం షార్కులు
- ఇవి సముద్రంలో మాఫియా వంటివంటూ నెటిజన్ల కామెంట్లు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఇది బాధాకరం అంటున్న మరికొందరు
సాధారణంగా షార్క్ చేపలంటేనే ఓ రకమైన భయం. సముద్రాల్లో షార్కులకు ఏదైనా ఆహారం కనిపించిందంటే అంతే.. వెంటపడి చంపి తీనేసేదాకా ఊరుకోవు. అలాంటి షార్క్ చేపలలో ఒక రకమైన ‘ఓర్కాలు’ విభిన్నంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ప్రత్యేకంగా పరిశోధన చేపట్టి..
- డ్రోన్ కెమెరా సాయంతో రెండు రకాల షార్కులపై నిఘా పెట్టిన ప్రభుత్వం.. దీనిని క్షుణ్నంగా పరిశీలించాలని నిర్ణయించింది.
- సోషల్ మీడియాలో ఈ వీడియోకు 15 వేలకుపైగా వ్యూస్ రాగా. వందల కొద్దీ లైకులు, రీట్వీట్లు నమోదవుతున్నాయి.
- ‘అలా మూడు ఓర్కాలు (షార్క్ జాతికి చెందిన జీవులు) కలిసి అదే జాతికి చెందిన గ్రేట్ వైట్ షార్క్ ను చంపడం బాధాకరం’ అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ‘అందుకే ఓర్కాలు కనిపిస్తే వెంటనే సముద్రానికి దూరంగా ఉంటాయి. అవి వేటకు దిగాయంటే ప్రాణాపాయమే..’ అని మరికొందరు చెబుతున్నారు.
- ‘‘పెద్ద పెద్ద షార్కులు, తిమింగలాలు వంటివి ఎన్నో ఉన్నా.. సముద్రాల్లో ఓర్కాలే రారాజులు. అవి ఒక్కసారి కొరికితే చాలు మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే..” అని షార్క్ చేపలకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు.
- ‘అసలు ఓర్కాలు అంటేనే సముద్రంలో మాఫియాల వంటివి. ఇలా గుంపుగా వచ్చి ఒంటరిని చేసి వేటాడుతాయి..’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.