Adipurush: 'బాయ్ కాట్ ఆదిపురుష్'.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత

Boycott trend against Adipurush movie

  • బాలీవుడ్ ను కుదిపేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్
  • 'ఆదిపురుష్'కి కూడా బాయ్ కాట్ దెబ్బ
  • వైరల్ అవుతున్న బాయ్ కాట్ ఆదిపురుష్, బ్యాన్ ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ లు

బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని దెబ్బకు ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఇది మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరకు వచ్చింది. ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' విడుదల కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలయింది. అయితే, ఈ ట్రైలర్ పై పలువురు పెదవి విరుస్తున్నారు. 

రామాయణంను ఒక రేంజ్ లో తీస్తారనుకుంటే... చివరకు గ్రాఫిక్స్ సినిమా తీశారేంటని విమర్శిస్తున్నారు. బొమ్మల సినిమాలా ఉందని అంటున్నారు. అంతేకాదు... రావణాసురుడు, హనుమంతుడు ఎలా ఉంటారో తెలియదా... వారిని అలా చూపిస్తారా? అని మండిపడుతున్నారు. అంతేకాదు... బ్యాన్ ఆదిపురుష్, బాయ్ కాట్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీయడం బాలీవుడ్ కు అలవాటయిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Adipurush
Bollywood
Tollywood
Boycott
Bangladesh
  • Loading...

More Telugu News