Robots: తమిళనాడులో దసరా ఆయుధ పూజ నిర్వహించిన రోబోలు

Robots done Ayudha Pooja in VIT

  • పెరుగుతున్న రోబోల వాడకం
  • వీఐటీలో అచ్చెరువొందించిన రోబోల విన్యాసాలు
  • గంట మోగించిన ఓ రోబో
  • అమ్మవారికి హారతి పట్టిన మరో రోబో

భవిష్యత్తులో మానవ దైనందిన కార్యక్రమాల్లో రోబోల ప్రాతినిధ్యం పెరగనుంది. ఇప్పటికే శాస్త్రసాంకేతిక రంగాల్లో రోబోలను వినియోగిస్తున్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సల్లోనూ రోబోలు సహకారం అందించడం తెలిసిందే. 

తాజాగా, తమిళనాడులోని వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఇంజినీరింగ్ కాలేజీలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నాయి. వెల్లూరులోని వీఐటీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో పేరుంది. తాజాగా రోబోల ఆయుధ పూజతో వీఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక రోబో గంట మోగిస్తుండగా, మరో రోబో అమ్మవారికి హారతి ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Robots
Ayudha Pooja
VIT
Dasara

More Telugu News