VideoLAN: వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై భారత్ లో నిషేధం... కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపిన వీడియో లాన్

VideoLAN sends legal notice to Indian Govt

  • గత మార్చిలో వీఎల్ సీ పై నిషేధం
  • కారణాలు చెప్పలేదన్న వీడియో లాన్
  • వివరణ ఇవ్వాలని డిమాండ్
  • న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

కంప్యూటర్లు, ఫోన్లలో చాలామంది వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను వినియోగిస్తుంటారు. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్. ఈ యాప్ ను ఒక్క భారత్ లోనే ఏటా 25 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేస్తుంటారు. అయితే వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను భారత కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో నిషేధించింది. 

దీనిపై వీఎల్ సీ మీడియా ప్లేయర్ మాతృసంస్థ వీడియో లాన్ తీవ్రంగా స్పందించింది. భారత కేంద్ర ప్రభుత్వానికి లీగల్ నోటీసులు పంపించింది. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో వీడియో లాన్ భారత టెలికాం విభాగానికి లేఖ రాసింది. 

ఎలాంటి కారణాలు చూపకుండా నిషేధం విధించడం సరికాదని, తమ యాప్ ను నిషేధించడంపై భారత కేంద్రం ప్రభుత్వం కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని వీడియో లాన్ పేర్కొంది. కనీసం తమ వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించింది. వీఎల్ సీ మీడియా ప్లేయర్ యాప్ ను ఎందుకు నిషేధించారో ఇప్పుడైనా వెల్లడించాలని డిమాండ్ చేసింది. 

వర్చువల్ విధానంలో తమ అభిప్రాయాలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని కోరింది. వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల కాపీని అందజేయాలని కూడా స్పష్టం చేసింది. తాము కోరిన విధంగా భారత కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని వీడియో లాన్ హెచ్చరించింది.

VideoLAN
VLC Media Player
India Govt
Ban
Legal Notice
  • Loading...

More Telugu News