Madhu Yaskhi: కాపలా కుక్కలా ఉంటానన్నాడు.. కాటేసే నక్కలా మారిపోయాడు: మధు యాష్కీ

Madhu Yaskhi fires on KCR

  • లిక్కర్ స్కామ్ ను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ అంటున్నారు
  • కవిత ఎత్తుకునే బతుకమ్మ లోపల కూడా లిక్కర్ బాటిల్ ఉంటుంది
  • ఏపీలో వెలమలను కేసీఆర్ సంప్రదిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని అన్నారు. తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్... కాటేసే నక్కలా మారిపోయారని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జాతీయ రాజకీయాలు అంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తే... తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారని చెప్పారు. సొంత విమానం కొంటామని కేసీఆర్ అంటున్నారని... ఎవడబ్బ సొమ్ముతో విమానం కొంటారని మండిపడ్డారు. 

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ మూతి పగులగొట్టారని మధు యాష్కీ అన్నారు. లిక్కర్ కుంభకోణాన్ని కప్పి పుచ్చుకునేందుకే జాతీయ పార్టీ అంటున్నారని విమర్శించారు. కవిత ఎత్తుకునే బతుకమ్మ లోపల కూడా లిక్కర్ బాటిల్ ఉంటుందని అన్నారు. ఏపీలో ఉన్న కొందరు వెలమ కులస్తులను కేసీఆర్ సంప్రదిస్తున్నారని.. తన కుల సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికే ఈ ప్రయత్నాలని దుయ్యబట్టారు. గతంలో ఏపీని తిట్టిన కేసీఆర్... ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీకి వెళ్తారని ప్రశ్నించారు.

Madhu Yaskhi
Congress
KCR
K Kavitha
TRS
Munugode
  • Loading...

More Telugu News