Nagarjuna: ఒకసారి ఓకే అనుకున్న తరువాత సింగిల్ డైలాగ్ కూడా మార్చను: డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు

Praveen Sattharu Interview

  • 'గరుడవేగ'తో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు
  • నాగార్జునతో చేసిన 'ది ఘోస్ట్'
  • స్క్రిప్ట్ విషయంలో తన పద్ధతి ఎలా ఉంటుందనేది చెప్పిన డైరెక్టర్ 
  • రేపు రిలీజ్ అవుతున్న సినిమా  

ప్రవీణ్ ఇంతవరకూ ఒక అరడజను సినిమాలు తీశాడు. ఆయన పేరు చెప్పగానే 'చందమామ కథలు' .. 'గరుడవేగ' సినిమాలు గుర్తుకు వస్తాయి. నాగార్జున హీరోగా ఆయన రూపొందించిన 'ది ఘోస్ట్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ప్రవీణ్ సత్తారు, అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 

"ఈ సినిమాలో నాగార్జునగారు అందమైన ఘోస్ట్ గా కనిపిస్తారు. ఇంటర్ పోల్ ఏజెంట్ పాత్రలో ఆయన గొప్పగా చేశారు. ఆయనకి సహకరించే పాత్రలో సోనాల్ చౌహాన్ మరింత అందంగా కనిపిస్తారు. ఈ సినిమాకి ముందు నాగార్జున గారిని ఎప్పుడూ కలవలేదు. ఈ సినిమా వలన ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయనలో అంకితభావం ఏ రేంజ్ లో ఉంటుందనేది అర్థమైంది" అని అన్నాడు. 

"ఒకసారి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అన్నీ ఓకే అనుకున్న తరువాతనే సెట్స్ పైకి వెళ్లడం జరుగుతుంది. సెట్ కి వెళ్లిన తరువాత ఎవరు ఎన్ని చెప్పినా సింగిల్ డైలాగ్ కూడా మార్చను. అలా మార్చడం కరెక్టు కాదనేది నా ఉద్దేశం. హీరోయిన్ పాత్ర కోసం ముందుగా కాజల్ ను తీసుకున్నాము. రెండు రోజులు షూటింగు కూడా చేశాము. తన ప్రెగ్నెన్సీ కారణంగా తప్పుకోవడంతో సోనాల్ ను తీసుకోవడం జరిగింది" అంటూ చెప్పుకొచ్చాడు.

Nagarjuna
Sonal Chauhan
Praveen sattharu
The Ghost Movie
  • Loading...

More Telugu News