Dhanush: ధనుశ్ పనిలోనే ఉన్న శేఖర్ కమ్ముల .. సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే!

Dhanush and  Sekhar Kammula movie uupdate

  • 'లవ్ స్టోరీ'తో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల 
  • తదుపరి సినిమా ధనుశ్ తో 
  • జనవరి నుంచి సెట్స్ పైకి 
  • ఆ దిశగా జరుగుతున్న పనులు  

శేఖర్ కమ్ముల ఒక కథపై చాలా రోజులే కసరత్తు చేస్తాడు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికే ఆయన ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఈ లోగా ఆయన ప్రాజెక్టుకి సంబంధించిన అప్ డేట్స్ ఉండవు. అందుకు సంబంధించిన హడావిడి ఏక్కడా కనిపించదు. ధనుశ్ తో ఒక సినిమా ఉందని ఆయన ఆ మధ్య ప్రకటించాడు. అందుకు సంబంధించిన సమాచారం ఇంతవరకూ లేదు. దాంతో ఈ ప్రాజెక్టు ఉన్నట్టా .. లేనట్టా? అనుకుంటున్నారు. 

అయితే శేఖర్ కమ్ముల ఎప్పటిలానే తన ప్రాజెక్టుకి సంబంధించిన పనులను చకచకా చేసుకుంటూ వస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఆయన స్క్రిప్ట్ వైపు నుంచి అన్ని పనులను పూర్తి చేశాడని చెబుతున్నారు. మిగతా వైపుల నుంచి కూడా సన్నాహాలు ముగింపు దశకి చేరుకున్నాయి. దాంతో ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకుని వెళ్లడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. 

ప్రస్తుతం ధనుశ్ ఒక వైపున వరుస తమిళ సినిమాలను లైన్లో పెడుతూనే, మరో వైపున తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను పూర్తిచేసుకుని ఆయన శేఖర్ కమ్ముల ప్రాజెక్టు పైకి రానున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి. 'లవ్ స్టోరీ' తరువాత శేఖర్ కమ్ముల నుంచి రానున్న సినిమా కావడంతో, సహజంగానే అందరిలో ఆసక్తి ఉంది.

Dhanush
Venky Atluri
Sekhar kammula Movie
  • Loading...

More Telugu News