SP Balasubrahmanyam: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం

SP Balu statue removed in Guntur

  • మదర్ థెరీసా సెంటర్ లో గాన గంధర్వుడి విగ్రహం
  • అనుమతి లేదంటూ తొలగించిన అధికారులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళాకారులు
  • తిరిగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్

గుంటూరులో గతంలో కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదమైంది. బాలు విగ్రహం తొలగింపు పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు స్పందిస్తూ, మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసింది ఒక్క గుంటూరులోనే అని వెల్లడించారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

SP Balasubrahmanyam
Statue
Guntur
Kala Darbar
  • Loading...

More Telugu News