Airindia Planes: నోరూరించే రుచులతో ఎయిరిండియా విమానాల్లో కొత్త మెనూ

New menu in Airindia domestic planes

  • టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా
  • ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేందుకు ప్రయత్నం
  • వివిధ రకాల వంటకాలతో పండుగ సీజన్ మెనూ
  • బిజినెస్, ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం భిన్నమైన మెనూలు

దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఇటీవలే టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా మార్పులకు తెరలేపింది. అంతేకాదు, తమ దేశీయ విమాన సర్వీసుల్లో సరికొత్త మెనూ తీసుకువస్తోంది. పండుగ సీజన్లో నోరూరించే రుచులతో ప్రయాణికులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు షురూ చేసింది. 

చికెన్ 65, గ్రిల్డ్ స్లైస్డ్ పెస్టో చికెన్ శాండ్విచ్, బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీలు... తదితర ఐటమ్ లు మెనూలో ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి ఈ మెనూ అమలు చేస్తున్నారు. 

బిజినెస్ క్లాస్ మెనూ వివరాల్లోకెళితే... ఆలూ పరాటా, చికెన్ చెట్టినాడ్, చేపల కూర, మేదు వడ,  షుగర్ ఫ్రీ డార్క్ చాకోలేట్ ఓట్ మీల్ మఫ్ఫిన్, మస్టర్డ్ క్రీమ్ చికెన్ సాసేజ్, బంగాళాదుంప ఇగురు, ఇడ్లీలు, ముంబయి బటాటా వడ తదితర వంటకాలను అందించనున్నారు. 

ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం... చీజ్ మష్రూమ్ ఆమ్లెట్, డ్రై జీరా ఆలూ వెడ్జెస్, వెల్లుల్లి కలిపిన బచ్చలికూర-మొక్కజొన్న, వెజ్ బిర్యానీ, మలబార్ చికెన్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ ఇగురు, వెజిటబుల్ ఫ్రైడ్ నూడిల్స్, చిల్లి చికెన్ తదితర ఐటమ్ లు అందించనున్నారు. 

ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మెనూ రూపొందించినట్టు ఎయిరిండియా ప్రయాణికుల సేవా విభాగం అధిపతి సందీప్ వర్మ వెల్లడించారు.

Airindia Planes
New Menu
Delicious
Items
Domestic Services
  • Loading...

More Telugu News