Sudheer Babu: నన్నెవరూ ఆపలేరు .. 'హంట్' టీజర్ రిలీజ్!

Hunt movie teaser released

  • సుధీర్ బాబు హీరోగా 'హంట్'
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా 
  • కీలకమైన పాత్రలో శ్రీకాంత్ 
  • త్వరలోనే థియేటర్లకు రానున్న సినిమా

సుధీర్ బాబు హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. దాంతో ఆయన 'హంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన సినిమాకి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. 

ఓకే వ్యక్తిలో ఉన్న మరో వ్యక్తిని పరిచయం చేసే ఆసక్తికరమైన కథగా ఈ సినిమా కనిపిస్తోంది. అర్జున్ A - అర్జున్ B అనే రెండు పాత్రల మధ్య నలిగిపోయే హీరోగా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. వ్యక్తి ఒకడే అయినా ఆయన ఒక పాత్ర నుంచి మరోపాత్రలోకి మారిపోయినప్పుడు ఆయన ధోరణి విభిన్నంగా .. విలక్షణంగా అనిపిస్తుంది. రెండు పాత్రల మధ్య ఘర్షణను అతను అనుభవిస్తూ ఉంటాడు. 

తాను అర్జున్ A గానే ఉండాలని అనుకుంటున్నట్టుగా హీరో చెప్పడం .. 'ఏ కేసును ఆ అర్జున్ మొదలుపెట్టాడో ... అదే కేసును ఈ అర్జున్ పూర్తి చేయాలి' అని హీరోతో శ్రీకాంత్ అనడం ఆసక్తికరమైన అంశం. 'ప్రేమిస్తే' హీరో భరత్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించాడు. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాతోనైనా సుధీర్ బాబుకి హిట్ పడుతుందేమో చూడాలి. 

Sudheer Babu
Srikanth
Bharath
Hunt MOvie

More Telugu News