Swachh Survekshan Awards: పరిశుభ్ర నగరాల జాబితాలో ఐదో స్థానానికి పడిపోయిన విజయవాడ
- గతేడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ
- రెండు స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడిపోయిన వైనం
- టాప్ 10 నగరాల్లో విజయవాడతో పాటు విశాఖ, తిరుపతి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డుల్లో ఏపీకి మిశ్రమ ఫలితాలు దక్కాయి. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాలో గతేడాది 3వ స్థానంలో ఉన్న విజయవాడ ఈ ఏడాది రెండు స్థానాలు దిగజారి 5వ స్థానంలో నిలిచింది. ఇక దేశంలోని పరిశుభ్రమైన నగరాల జాబితాలో టాప్ 10 నగరాల్లో ఏపీకి చెందిన 3 నగరాలకు చోటు దక్కింది. ఈ జాబితాలో విజయవాడ ఐదో స్థానంలో ఉండగా... విశాఖపట్నం, తిరుపతి నగరాలు వరుసగా 4, 7వ స్థానాల్లో నిలిచాయి.
ఇక ఈ జాబితాలో గడచిన ఐదేళ్లుగా తొలి స్థానంలో నిలుస్తూ వస్తున్న ఇండోర్... ఈ ఏడాది కూడా తన స్థానాన్ని పదిలపరుచుకుని వరుసగా ఆరేళ్ల పాటు ఈ అవార్డును దక్కించుకుని రికార్డులకు ఎక్కింది. ఇండోర్ తర్వాత సూరత్, నవీ ముంబై వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. ఇక పరిశుభ్రమైన రాష్ట్రాల జాబితాలో మధ్య ప్రదేశ్ టాప్‌లో నిలవగా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి.