KTR: ట్విట్ట‌ర్‌లో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని బ్లాక్ చేసిన కేటీఆర్‌

ktr blocked komatireddy rajgopal reddy on twitter
  • కేటీఆర్ బ్లాక్ చేసిన విష‌యాన్ని వెల్ల‌డించిన రాజ‌గోపాల్ రెడ్డి
  • తెలంగాణ ద్రోహుల జాడ చెప్ప‌లేకే త‌న‌ను కేటీఆర్ బ్లాక్ చేశార‌ని కామెంట్‌
  • ద్రోహుల‌కు భ‌య‌ప‌డ‌కుండా ఎలా ఉంటారంటూ సెటైర్‌
టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్... కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిని ట్విట్ట‌ర్‌లో బ్లాక్ చేశారు. ఈ విష‌యాన్ని రాజగోపాల్ రెడ్డి శుక్ర‌వారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గానే వెల్ల‌డించారు. కేటీఆర్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఆయ‌న చేసే ట్వీట్లు ఇక రాజ‌గోపాల్ రెడ్డికి క‌నిపించ‌వు.

కేటీఆర్ చ‌ర్య‌పై కోమ‌టిరెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ ద్రోహుల జాడ చెప్ప‌లేక భ‌య‌ప‌డి త‌న‌ను కేటీఆర్ బ్లాక్ చేశారంటూ ఆయ‌న తెలిపారు. తెలంగాణ‌ ద్రోహులు ఇచ్చిన కానుక‌లు స్వీక‌రించి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన మీరు... వారికి భ‌య‌ప‌డ‌కుండా ఎందుకు ఉంటారని కూడా కేటీఆర్‌ను ఎద్దేవా చేశారు. చివ‌రికి టీఆర్ఎస్ ఉద్య‌మ ద్రోహుల‌తో నిండిపోయింద‌ని ఒప్పుకున్నందుకు కృత‌జ్ఞ‌తలు అంటూ రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో కామెంట్ చేశారు.
KTR
TRS
BJP
Komatireddy Raj Gopal Reddy
Telangana
Twitter

More Telugu News