Komatireddy Raj Gopal Reddy: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

komatireddy raj gopal reddy meets amit shah in delhi

  • కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజ‌గోపాల్ రెడ్డి
  • మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్య‌ర్థిగా రంగంలోకి 
  • ఉప ఎన్నిక‌ల‌పైనే అమిత్ షాతో చ‌ర్చ‌లు

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాజ‌గోపాల్ రెడ్డి... ఇటీవ‌లే కాంగ్రెస్ పార్టీతో పాటు మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే ఆయ‌న అమిత్ షా స‌మ‌క్షంలోనే బీజేపీలో చేరిపోయారు. 

కోమ‌టిరెడ్డి రాజీనామాతో త్వ‌ర‌లోనే మునుగోడుకు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఉప ఎన్నికలో బీజేపీ అభ్య‌ర్థిగా రాజ‌గోపాల్ రెడ్డే బ‌రిలోకి దిగ‌నున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం అమిత్ షాతో భేటీ అయిన రాజ‌గోపాల్ రెడ్డి... మునుగోడు ఉప ఎన్నిక‌ల‌పైనే కేంద్ర మంత్రితో చ‌ర్చించారు. మునుగోడులో బీజేపీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌తో పాటుగా ఇత‌ర పార్టీల ఎన్నిక‌ల వ్యూహాల‌పైనా ఆయ‌న అమిత్ షాతో చ‌ర్చించారు.

More Telugu News