Allu Arjun: భార్యా పిల్లలతో కలసి వాఘా సరిహద్దులో అల్లు అర్జున్ సందడి

Allu Arjun visits Wagah border with wife Sneha and kids

  • అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజున పంజాబ్ లో పర్యటన
  • తొలుత అమృత్ సర్ స్వర్ణ దేవాలయం సందర్శన
  • అనంతరం వాఘా సరిహద్దులో సైనికులతో సందడి

‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలసి పాకిస్థాన్ సరిహద్ధు వాఘా చెక్ పోస్ట్ వద్ద సందడి చేశాడు. తన భార్య స్నేహారెడ్డి పుట్టిన రోజు నాడు వినూత్నంగా సరిహద్దు జవాన్లతో గడిపారు. అల్లు అర్జున్ వెంట ఆయన భార్య స్నేహారెడ్డి, కుమార్తె అర్హ, కుమారుడు అయాన్ కూడా ఉన్నారు. ప్రతి రోజు సాయంత్రం బీఎస్ఎఫ్ జవాన్లు చేసే కవాతులో అల్లు అర్జున్ గౌరవ అతిథిగా పాల్గొన్నాడు. సైనిక సిబ్బంది తో కలసి ఫొటోలు తీసుకున్నాడు. 

ఈ నెల 29న స్నేహారెడ్డి పుట్టిన రోజు. దీంతో తొలుత పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలసి సందర్శించాడు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత.. వాఘా సరిహద్దుకు వెళ్లిపోయారు. ఈ ఫొటోలను అల్లు అర్జున్ తన ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేశాడు.

Allu Arjun
Sneha reddy
visits
Wagah Border
  • Loading...

More Telugu News