Ameesha Patel: పాకిస్థాన్ నటుడితో డేటింగ్ వార్తలపై అమీషా పటేల్ స్పందన

Ameesha Patel reacts to rumors

  • ఇమ్రాన్ అబ్బాస్ తో అమీషా చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం
  • చాన్నాళ్ల తర్వాత అతడిని కలిశానని అమీషా వివరణ
  • ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని ఆరోపణ

తెలుగులో 'బద్రి' చిత్రంతో తళుక్కున మెరిసిన బాలీవుడ్ భామ అమీషా పటేల్ ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఆమె వ్యక్తిగత జీవితంపై ఇప్పటికే అనేక కథనాలు వినిపించాయి. తాజాగా, ఆమె పాకిస్థానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో డేటింగ్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. 

ఇమ్రాన్ అబ్బాస్... అమీషాకు కాలేజి స్నేహితుడు. ఈ మధ్య ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. దీనిపై అమీషా పటేల్ స్పందించింది. 

తనపై వస్తున్నవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఈ సిల్లీ కథనాలను చూసి నవ్వుకున్నానని వివరించింది. ఇమ్రాన్ అబ్బాస్ తనకు మిత్రుడు మాత్రమేనని, చాన్నాళ్ల తర్వాత అతడిని కలిశానని అమీషా వెల్లడించింది. దాంతో ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. 

ఇక, అమీషా, ఇమ్రాన్ అబ్బాస్ ఓ పాటకు అభినయం చేసినట్టుగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దానిపైనా అమీషా వివరణ ఇచ్చింది. తామిద్దరం కలుసుకున్న సందర్భంగా అప్పటికప్పుడు ఆ వీడియో చేశామే తప్ప, ముందుగా ప్లాన్ చేసుకున్నది కాదని స్పష్టం చేసింది.

Ameesha Patel
Imran Abbas
Dating
Pakistan
Bollywood
  • Loading...

More Telugu News