Allu Shirish: కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు: 'ఊర్వశివో .. రాక్షసివో' టీజర్ రిలీజ్!

Urvasivo Rakshasivo teaser released

  • శిరీష్ తాజా చిత్రంగా 'ఊర్వశివో .. రాక్షసివో'
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ జోనర్లో నడిచే కథ 
  • నవంబర్ 4వ తేదీన విడుదల

అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నప్పటికీ, ఇంతవరకూ ఆయనకి సరైన బ్రేక్ పడలేదనే చెప్పాలి. అందువల్లనేనేమో ఈ సారి కాస్త రొమాన్స్ పాళ్లు ఎక్కువగా ఉన్న లవ్ స్టోరీ చేసినట్టుగా అనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఊర్వశివో రాక్షసివో' రెడీ అవుతోంది.

కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. "కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు .. ఒక్కోసారి అనుకోకుండా జరిగిపోతుంటాయి" అంటూ రొమాంటిక్ సీన్స్ తోనే టీజర్ ను ఎక్కువగా కట్ చేశారు. హీరో .. హీరోయిన్ ఒకే ఆఫీసులో పనిచేయడం .. వాళ్ల మధ్య ప్రేమాయణమే ఈ సినిమా అనే విషయం అర్థమవుతూనే ఉంది. 

ధీరజ్ మొగిలినేని - విజయ్ నిర్మించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో శిరీష్ హిట్ పడతాడేమో చూడాలి.

Allu Shirish
Anu Emmanuel
Sunil
Urvasivo Rakshasivo Movie

More Telugu News