Sensex: వరుసగా ఏడో రోజు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

markets ends in losses

  • 188 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 40 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా నష్టపోయిన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 16,818 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.16%), టాటా స్టీల్ (1.68%), సన్ ఫార్మా (1.38%), నెస్లే ఇండియా (1.17%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-5.22%), టెక్ మహీంద్రా (-1.86%), టైటాన్ (-1.69%), కోటక్ బ్యాంక్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.36%).

  • Loading...

More Telugu News