Prabhas: అక్టోబర్ 2న 'ఆదిపురుష్' ఈవెంట్ .. అదే వేదికపై టీజర్ రిలీజ్!

Adi Purush movie Update

  • పోస్టు ప్రొడక్షన్ పనుల్లో 'ఆది పురుష్'
  • అయోధ్య వేదికగా టీజర్ రిలీజ్
  • ఇక అక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలు  
  • వచ్చే ఏడాది జనవరి 12న సినిమా రిలీజ్

ప్రభాస్ ను 'బాహుబలి'లో చూసిన వాళ్లంతా, పౌరాణికాలకు కూడా ఆయన బాగా సెట్ అవుతాడని అనుకున్నారు. అదే సమయంలో ఆయనకి 'ఆది పురుష్'లో శ్రీరాముడిగా చేసే ఛాన్స్ వచ్చింది. సీతాదేవిగా కృతి సనన్ .. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. 

భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ ఎలా కనిపించనున్నాడనేది అందరిలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ తో పాటు టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆయోధ్యలోని సరయూ నది ఒడ్డున టీజర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, ఆ వేదిక ద్వారా టీజర్ ను వదులుతారట. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి..

Prabhas
Krithi Sanon
Saif Alikhan
Adi Purush Movie
  • Loading...

More Telugu News