Allu Arjun: కోలీవుడ్ మాస్ డైరెక్టర్ కి బన్నీ గ్రీన్ సిగ్నల్!

Allu Arjun in Atlee Kumar movie

  • అక్టోబర్ 1 నుంచి 'పుష్ప 2' షూటింగ్ 
  • 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు త్రివిక్రమ్ తో చేసే ఛాన్స్ 
  • లైన్లోనే ఉన్న అట్లీ కుమార్ మూవీ   

అల్లు అర్జున్ తాజా చిత్రంగా సెట్స్ పైకి వెళ్లడానికి 'పుష్ప 2' రెడీ అవుతోంది. .. మైత్రీ బ్యానర్లో .. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 1వ తేదీన అల్లు స్టూడియోలో ఈ సినిమా షూటింగును లాంఛనంగా మొదలుపెట్టనున్నారు. అక్టోబర్ 10వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. 

ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకి ముందుగాగానీ, ఆ తరువాతగాని అట్లీ కుమార్ తో ఆయన సినిమా ఉండనుందని అంటున్నారు. ఆల్రెడీ బన్నీ కథ వినడం .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని చెబుతున్నారు.

ప్రస్తుతం షారుక్ ఖాన్ తో 'జవాన్' సినిమాతో అట్లీ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బన్నీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నట్టు చెబుతున్నారు. కోలీవుడ్ లో విజయ్ కి వరుస హిట్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ గా అట్లీకి మంచి పేరు ఉంది. ఆయనతో బన్నీ చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండే అవకాశాలు ఎక్కువని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.

Allu Arjun
Sukumar
Atlee Kumar
  • Loading...

More Telugu News