Kerala: ముత్యాల్లాంటి అక్షరాలతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్.. 'వావ్' అంటున్న జనాలు

Kerala Doctor Neat Writing On Prescription Goes Viral
  • కేరళలో పిల్లల డాక్టర్ గా పని చేస్తున్న నితిన్ నారాయణన్
  • బ్లాక్ లెటర్స్ తో పిల్లలు సైతం చదివేలా ప్రిస్క్రిప్షన్
  • నెట్ లో వైరల్ అవుతున్న మందుల చీటీ 
మనలో ఎవరికీ అర్థం కానిది ఏదైనా ఉంటుందంటే... అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. అందరికీ అర్థమయ్యేలా ప్రిస్క్రిప్షన్ రాయాలని సుప్రీంకోర్టు సైతం సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేరళకు చెందిన ఓ డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ముత్యాల్లాంటి అక్షరాలతో డాక్టర్ నితిన్ నారాయణన్ రాసిన మందుల చీటీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. పాలక్కాడ్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆయన చిన్న పిల్లల డాక్టర్ (పిడియాట్రీషియన్)గా పని చేస్తున్నారు. బ్లాక్ లెటర్స్ తో నర్సరీ పిల్లలు సైతం చదివేలా ఉన్న ఆయన దస్తూరీని చూసిన వారంతా 'వావ్' అంటున్నారు. నారాయణన్ ను చూసి ఎలా రాయాలన్నది ఇతర డాక్టర్లు కూడా నేర్చుకోవాలని నెటిజెన్లు హితవు పలుకుతున్నారు. 
Kerala
Doctor
Prescription

More Telugu News