Vishal: చెన్నైలో హీరో విశాల్ నివాసంపై దాడి... పోలీసులకు ఫిర్యాదు

Attack on Hero Vishal house in Chennai

  • ఎర్రరంగు కారులో వచ్చిన దుండగులు
  • విశాల్ ఇంటిపై రాళ్లు విసిరిన వైనం
  • ఇంటి కిటికీల అద్దాలు ధ్వంసం
  • అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్న విశాల్
  • మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ హీరో విశాల్ నివాసంపై దుండగులు దాడికి దిగారు. చెన్నైలోని ఆయన నివాసంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో విశాల్ నివాసం కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. దుండగులు ఎర్ర రంగు కారులో వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజిలో కనిపించింది. 

కాగా, దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేరు. అవుట్ డోర్ షూటింగ్ లో ఉన్న విశాల్ తన ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుకుని, మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. సీసీటీవీ ఫుటేజి వీడియోను కూడా పోలీసులకు అందించారు.

హీరో విశాల్ నివాసం అన్నానగర్ లో ఉంది. విశాల్ ఈ ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు.

Vishal
House
Attack
Chennai
Police
  • Loading...

More Telugu News