Chandrababu: తిరుపతిలో గోడలపై హిందూ దేవతల బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను: చంద్రబాబు

Chandrababu shared a photo

  • ఎస్వీ వర్సిటీ రోడ్డులో గోడలకు వైసీపీ రంగులు
  • ఫొటో పంచుకున్న చంద్రబాబు
  • హిందూమతాన్ని అవమానిస్తున్నారని వ్యాఖ్యలు
  • భక్తులు ఆగ్రహంతో రగలిపోతున్నారని వెల్లడి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన గోడలపై గతంలో హిందూ దేవతల బొమ్మలు ఉండగా, ఇప్పుడు వాటి స్థానంలో వైసీపీ రంగులు ఉన్న ఫొటోను టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. హిందూ దేవతల స్థానంలో ఏపీ అధికార పక్షం వైసీపీ రంగులు ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. హిందూ మతాన్ని అవమానించాలన్న లక్ష్యంతో ఈ చర్యలకు పాల్పడడంపై భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు అప్పుడు, ఇప్పుడు అనే క్యాప్షన్ తో ఉన్న ఆ ఫొటోను చంద్రబాబు ట్వీట్ చేశారు.

Chandrababu
Godesses
Hindu
YCP Colours
SV University Road
Tirupati
  • Loading...

More Telugu News