Vikram: 'పొన్నియిన్ సెల్వన్'కి ప్రత్యేకమైన ఆకర్షణగా మెగా వాయిస్!

Ponniyan Selven Movie Update

  • మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా 'పొన్నియిన్ సెల్వన్'
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ 
  • భారీగా పెరుగుతున్న అంచనాలు 
  • ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయి రిలీజ్ 

మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వన్' సినిమా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, విక్రమ్ .. కార్తి .. జయం రవి .. శరత్ కుమార్ .. పార్తీబన్ .. ఐశ్వర్య రాయ్ .. త్రిష .. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

ఈ సినిమా విషయంలో చిరంజీవికి థ్యాంక్స్ చెప్పాలని మణిరత్నం ఒక సందర్భంలో అన్నారు. దాంతో ఈ సినిమాకి చిరూ వాయిస్ ఓవర్ చెప్పి ఉంటారని చాలామంది అనుకున్నారు .. అది నిజమేననేది తాజా సమాచారం. తెలుగు వెర్షన్ కి సంబంధించి కథలోకి వెళ్లడానికి ముందు, ఆ తరువాత కొన్ని సన్నివేశాలను కలిపే సందర్భంలోను చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టుగా సమాచారం. 

ఇక తమిళంలో కమల్ తోను .. కన్నడలో ఉపేంద్రతోను .. మలయాళంలో మమ్ముట్టితోను .. హిందీలో అజయ్ దేవగణ్ తోను వాయిస్ ఓవర్ చెప్పించారట. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా, రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ నుంచి మరో సంచలనాన్ని ఈ సినిమా నమోదు చేస్తుందేమో చూడాలి.

Vikram
Aishwarya Rai
Mani Ratnam
Ponniyin Selvan Movie
  • Loading...

More Telugu News