Ranjith: ప్రేమకథా చిత్రంగా 'లెహరాయి' .. లిరికల్ సాంగ్ రిలీజ్!

Leharayi lyrical  song released

  • రంజిత్, సౌమ్య మీనన్ జంటగా 'లెహరాయి'  
  • ఘంటాడి కృష్ణ అందించిన సంగీతం
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 

తెలుగు తెరను పలకరించేవాటిలో ప్రేమకథా చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. యూత్ ఎక్కువగా సినిమాలను చూస్తూ ఉంటుంది గనుక, వారికి ఇష్టమైన కంటెంట్ ను అందించడానికి మేకర్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. అలా రూపొందిన ప్రేమకథా చిత్రాలలో ఒకటిగా ప్రేక్షకులను పలకరించడానికి 'లెహరాయి' రెడీ అవుతోంది. 

రంజిత్ - సౌమ్య మీనన్ నాయకా నాయికలుగా ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. బెక్కెం వేణు గోపాల్ నిర్మించిన ఈ సినిమాకి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు. 'అప్సరస .. అప్సరస నా కంట ఎందుకు పడ్డావే అప్సరస. అప్సరస .. అప్సరసన  నా గుండె చప్పుడు నువ్వేలే అప్సరస' అంటూ ఈ పాట నడుస్తోంది. 

చాలా గ్యాప్ తరువాత ఘంటాడి కృష్ణ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఆయన స్వరపరిచిన బాణీలకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా రేవంత్ ఆలపించాడు. సాహిత్యం పరంగా అంత గొప్పగా ఏమీ అనిపించదుగానీ, తన వాయిస్ తో ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి రేవంత్ ప్రయత్నించినట్టుగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ranjith
Soumya Menon
Leharayi Movie

More Telugu News