Supreme Court: సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం
- ఎన్ఐసీ ప్లాట్ ఫామ్ పై ప్రసారం
- భవిష్యత్తులో ఓటీటీ తెచ్చే యోచన
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పై తొలి విచారణ
సుప్రీంకోర్టు ఓ చారిత్రాత్మక అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణల ప్రత్యక్ష ప్రసారాన్ని సోమవారం మొదలు పెట్టింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను లైవ్ వెబ్ కాస్ట్ రూపంలో విచారణ చేపట్టింది. అలాగే, ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య సేవల విభజనపై వివాదంపై పిటిషన్ లోనూ ఈ ధర్మాసనం విచారణ నిర్వహించనుంది.