Iran: ఇరాన్‌లో కొనసాగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనలు.. 75 మంది మృతి

Death to the dictator slogan raised in Irans anti hijab protests

  • హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల యువతిని అరెస్ట్ చేసిన నైతిక విభాగం పోలీసులు
  • ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో మృతి
  • దేశంలోని 46 నగరాలు, పట్టణాలకు వ్యాపించిన నిరసనలు
  • సుప్రీంలీడర్ ఆయతుల్లాకు వ్యతిరేకంగా ఆందోళనకారుల నినాదాలు
  • ఆందోళనల వెనక విదేశీ కుట్ర లేదన్న ఇరాన్

ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు తెరపడడం లేదు. గత పది రోజులుగా వేలాదిమంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు 75 మంది మృతి చెందారు. 

హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో మహస అమిని అనే 22 ఏళ్ల యువతిని నైతిక విలువల విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో ఆ తర్వాత ఆమె మృతి చెందడం దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిన్న వేలాదిమంది ఆందోళనకారులు ‘డెత్ టు ద డిక్టేటర్’ అంటూ నినాదాలు చేశారు. మూడు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖొమైనీ పాలనకు చరమగీతం పలకాలని నినదించారు. 

అమిని మృతి తర్వాత దేశంలోని 46 నగరాలు, పట్టణాలు, గ్రామాలకు నిరసనలు పాకాయి. ఈ నెల 17న ప్రారంభమైన నిరసనల్లో ఇప్పటి వరకు 41 మంది ఆందోళనకారులు, పోలీసులు చనిపోయినట్టు ఇరాన్ అధికారిక టీవీ ప్రకటించింది. అమిని మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో విదేశీ కుట్ర ఉందన్న వార్తలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.

  • Loading...

More Telugu News