Srinu Vaitla: మళ్లీ రవితేజతోనే ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల?

Raviteja in Srinu  Vaitla movie

  • రవితేజతో శ్రీను వైట్ల మూడు హిట్స్ 
  • ఇద్దరి ఖాతాలో ఒక ఫ్లాపు 
  •  ఆ తరువాత వచ్చిన గ్యాపు 
  • త్వరలోనే మరోసారి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్   

శ్రీను వైట్ల పేరు చెప్పగానే ఆయన నుంచి వచ్చిన భారీ సినిమాలు ... అవి సాధించిన ఘన విజయాలు గుర్తుకు వస్తాయి. కామెడీ ఎపిసోడ్స్ చేయడంలో ఆయన తరువాతనే ఎవరైనా అనే ఒక పేరు ఉండేది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్స్ జాబితాలో చేరిపోయిన ఆయన, అంతే ఫాస్టుగా వరుస ఫ్లాపులతో వెనుకబడ్డారు. ఆయన నుంచి సినిమా వచ్చి చాలాకాలమే అయింది. 

ఆ మధ్య మంచు విష్ణు హీరోగా 'ఢీ' సినిమాకి సీక్వెల్ చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్టు ఇంతవరకూ పట్టాలెక్కలేదు. ఇక ఆయన ప్రాజెక్టు లేనట్టేననే టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రవితేజకి ఒక కథను వినిపించి ఆయనను ఒప్పించినట్టుగా చెబుతున్నారు. ఈ కాంబో సెట్ అయినట్టేనని అంటున్నారు. 

దర్శకుడిగా శ్రీను వైట్ల తన కెరియర్ ను రవితేజ 'నీ కోసం' సినిమాతోనే మొదలెట్టారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'వెంకీ' .. 'దుబాయ్ శీను' సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అందువల్లనే వరుస ఫ్లాపులతో ఉన్న శ్రీను వైట్లతో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయడానికి రవితేజ అంగీకరించాడు. అయితే ఆ సినిమా కూడా పరాజయం పాలైంది. అయినా ఇప్పుడు శ్రీను వైట్లతో మరో సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.

Srinu Vaitla
Raviteja
Manchu Vishnu
  • Loading...

More Telugu News