Pruthvi: డిప్రెషన్ లోకి వెళ్లిపోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు: 'పెళ్లి' పృథ్వీ

Pelli Pruthvi Interview

  • 'పెళ్లి' సినిమాతో పేరు తెచ్చుకున్న పృథ్వీ 
  • కొడుకు కారణంగా సినిమాలకి దూరం 
  • నటుడిగా సంతృప్తి లేదన్న పృథ్వీ 
  • మంచి అవకాశాల కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్య

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాలలో 'పెళ్లి' ఒకటి. 1997లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాతోనే నటుడు పృథ్వీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ తరువాత అనేక అవకాశాలను తెచ్చిపెట్టింది. కొన్ని సినిమాలు చేసిన అనంతరం ఎనిమిది .. తొమ్మిదేళ్ల పాటు ఆయన తెరపై కనిపించలేదు. ఆ సమయంలో తాను భయంకరమైన డిప్రెషన్ లో ఉన్నట్టుగా ఆయన చెప్పారు.

"ఇప్పటికీ నన్ను అందరూ 'పెళ్లి' పృథ్వీ అనే పిలుస్తారు. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళుతున్నాను. నటుడిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. చేయవలసిన పాత్రలు చాలానే ఉన్నాయి .. డబ్బు కూడా సంపాదించుకోవాలి. మాకు ఒకడే అబ్బాయి .. తనకి ఆటిజం. తనకి ఇప్పుడు 27 ఏళ్లు .. మానసిక ఎదుగుదల లేదు .. మాట్లాడలేడు.  ఫస్టు టైమ్ ఆ విషయం వినగానే నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. 

ఎనిమిది .. తొమ్మిదేళ్లపాటు పాటు డిప్రెషన్ లోనే ఉండిపోయాను. ఆ సమయంలో సినిమాలు చేయలేదు. అది ఎంత పెద్ద పొరపాటు అనేది ఆ తరువాత నాకు అర్థమైంది. అంతేకాదు నేను చేసిన కొన్ని సినిమాల్లో చాలా సీన్స్ లేపేసేవారు. కొంతమంది హీరోలు అలా చేయించారని తెలిసి బాధపడ్డాను. ఇవన్నీ కూడా నా కెరియర్ పై ప్రభావం చూపించాయి" అంటూ చెప్పుకొచ్చాడు.

Pruthvi
Interview
Tollywood
  • Loading...

More Telugu News