Vikram: పెరిగిన గ్లామర్ .. అందరి చూపులు త్రిష పైనే!

Trisha Special

  • 'పొన్నియిన్ సెల్వన్'  రిలీజ్ కి సన్నాహాలు 
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష 
  • ఆమె గ్లామర్ పైనే జరుగుతున్న చర్చ  

త్రిష అనగానే తెలుగు తెరపై చురుకుగా .. చలాకీగా ఆమె చేసిన పాత్రలు కళ్లముందు కదలాడతాయి. ఆకర్షణీయమైన ఆమె నవ్వును ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి స్టార్ డమ్ ను చూసిన హీరోయిన్ ఆమె. అలాంటి త్రిష ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. తమిళ .. మలయాళ సినిమాలతో ఆమె బిజీగా ఉంది. 

అలాంటి త్రిషను నిన్న హైదరాబాదులో జరిగిన 'పొన్నియిన్ సెల్వన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తెలుగు ప్రేక్షకులు చూశారు. బ్లాక్ కలర్ శారీలో ఆమె నల్ల గులాబీలా మెరిసిపోయింది. నిజం చెప్పాలంటే ఆమె మునుపటి కంటే గ్లామరస్ గా తయారైంది. ఒక వైపున రెడ్ కలర్ డ్రెస్ లో ఐశ్వర్య రాయ్ తళుక్కుమంటున్నా, ఆమె ముందు తేలిపోకుండా త్రిష ఆకర్షించింది. 

చూసిన వాళ్లంతా త్రిష మరింత  అందంగా తయారైందనే చెప్పుకుంటున్నారు. స్టేజ్ పైన దిల్ రాజు కూడా అదే మాట అన్నారు. చూస్తుంటే ఈ సినిమా తరువాత సీనియర్ స్టార్ హీరోల సరసన తెలుగులో త్రిష బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె పోషించిన 'కుందవై' పాత్ర హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Vikram
Karthi
Aishvarya Rai
Trisha
Ponniyin Selvan Movie
  • Loading...

More Telugu News