Joe Biden: స్టేజ్ పై బిత్తర చూపులు చూసిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. వీడియో వైరల్

US President Joe Biden appears lost on stage after speech

  • ఓ కార్యక్రమంలో ప్రసంగం ముగిసిన తర్వాత తికమక 
  • న్యూయార్క్ లో గ్లోబల్ ఫండ్ సంస్థ కాన్ఫరెన్స్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఒక్క మాటతో, కను సైగతో ప్రపంచాన్ని శాసించగలిగే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్టేజ్ పై చిన్నపిల్లాడిలా బిత్తర చూపులు చూశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఎటు వెళ్లాలో... ఏం చేయాలో తెలియక బైడెన్ తికమక పడ్డ ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూయార్క్‌ నగరంలో గ్లోబల్ ఫండ్ సంస్థ  ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తొలుత స్టేజ్‌పైకి వచ్చిన బైడెన్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత.. పోడియం దిగేందుకు కుడివైపు కొన్ని అడుగులు వేశారు.  ఆ వెంటనే ఆగి వెనక్కి తిరిగారు. ఎటువెళ్లాలో తెలియక కాస్తంత తికమక పడ్డారు. స్టేజ్ చివర్లో కొన్ని క్షణాల పాటు ఎటూ కదలకుండా నిలబడిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇంతలో హోస్ట్ మైక్ తీసుకొని బైడెన్ కు ధన్యవాదాలు చెప్పే సందేశం చదివారు. అప్పుడు కార్యక్రమం ముగిసిందని తెలియడంతో బైడెన్ వెనక్కు తిరిగి అటువైపు వెళ్లారు. 

ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది బైడెన్ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కానీ, ప్రసంగం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడి తడబాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏప్రిల్ లోనూ బైడెన్ ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నారు. ఎదురుగా ఎవరూ లేకున్నా కరచాలనం చేసేందుకు చేయి ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

Joe Biden
US President
lost on stage
Viral Videos

More Telugu News