Telangana: వ్యవసాయాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామనడం దారుణం: కేటీఆర్
- కేంద్రం విద్యుత్ సంస్కరణలపై ధ్వజమెత్తిన కేటీఆర్
- విద్యుత్ సంస్కరణల అమలుతో నష్టపోయేది తెలంగాణ రైతేనని వెల్లడి
- ధాన్యం సేకరణలో నష్టం వస్తోందని వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేస్తారా? అని నిలదీత
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటన చేయడం దారుణమని ఆయన అన్నారు. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోంది గనుక దానిని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సుధాంషు పాండే బుధవారం చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.